అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . విలన్ పాత్రలో పహాధ్ ఫజిల్ నటిస్తూ ఉండగా... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలల్ కనిపించనున్నారు . మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రెండు వీడియోలను మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది . వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది .

సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొ క్క మొదటి పాటను విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా మే మొదటి వారంలో ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం . ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ పాటలు అద్భుతమైన రీతిలో ప్రేక్షకు లను అలరించాయి. మరి పుష్ప పార్ట్ 2 సాంగ్స్ ఏ స్థాయి లో అలరిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa