ఈ సిరీస్ లో భాగంగా ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ తెరకెక్కగా జూన్ నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు 'డెడ్‌పూల్ & వోల్వారిన్' కలెక్షన్ల పరంగా అదరగొడుతుందని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ లో తెలుగు డబ్బింగ్ అద్భుతంగా ఉందని ఈ సిరీస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైనమెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్రధాన పాత్రల్లో షాన్ లెవీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో వినోదం అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా నిరాశపరిచే అవకాశం లేదని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఆ సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు.