ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. తేజ సజ్జ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మిరాయ్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ , టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సారి కూడా తేజ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ వీడియో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ సజ్జా కమిటైన కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే తేజ సజ్జాకు రీసెంట్ గా నందిని రెడ్డి ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నదని తెలుస్తోంది. గతంలో వీళ్లద్దరి కాంబినేషన్ లో ఓ బేబీ వచ్చింది. అయితే ఆ సినిమాలో క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు నందనీ రెడ్డి రెడీ చేసిన కథ మొత్తం తేజ చుట్టూనే తిరగనుందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా వారు నిర్మించే ఈ చిత్రం త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు.