అయితే అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోయి అందరిని షాక్ గురి చేశారు. విడిపోయిన తర్వాత కూడా ఎవరీ సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. అయితే సమంత మాత్రం మయోసైటిస్ వ్యాధిన బారిన పడడంతో ఇప్పటికీ సతమతమవుతోంది. అలాగే సమంత స్టార్ హీరోయిన్గా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటోంది. పలు రకాల హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సమంత తన మొదటి జీతం ఎంత ఆమె ఏం చేసేది అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
సమంత కాలేజీ చదువుకుంటున్న సమయంలో పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపుగా అడుగులు వేసిందట. అలా తన ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఒక ఈవెంట్లో గెస్ట్ గా వేదిక మీదికి పిలవడానికి యాంకర్ గా వెళ్లినట్లు సమాచారం. ఆ పని చేసినందుకుగాను సమంతకి అప్పట్లోనే రూ .500 రూపాయలు ఇచ్చారట. ఇదే తన మొదటి సంపాదన అని ఎన్నోసార్లు తెలియజేసింది. సమంత ప్రస్తుతమైతే కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమంత తెలుగు, హిందీ ,తమిళ్ వంటి భాషలలో కూడా నటిస్తోంది. ఈమధ్య కాస్త సినిమాల హవా తగ్గించిన అభిమానులతో మాత్రం ఎప్పుడు చిట్ చాట్ నిర్వహిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సమంతకు సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది.