‘‘మై డియర్ దొంగపై మొదటి నుంచి చాలా నమ్మకంగా వున్నామని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మా నమ్మకం నిజమైయింది. సినిమా చూసిన వారంతా గొప్ప అభినందిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమటం నటనని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి' అని కోరారు
దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారన్నారు.
సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని హీరో అభినవ్ గోమటం అన్నారు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి థాంక్స్. తొలి సినిమాని ఇంత చక్కగా రాసిన శాలినికి అభినందనలు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వంశీ, శర్వాతో పాటు టీం అందరికీ థాంక్స్. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చారు. ఆహా టీం అందరికీ ధన్యవాదాలు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అన్నారు.
ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్, రైటర్ శాలినీ అన్నారు. ఇంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదన్న ఆమె.. ఆహ టీంకి ధన్యవాదాలు తెలిపారు. ఇది బ్యూటీఫుల్ టీం వర్క్. పాషన్ తో ఒక కంటెంట్ ని హానెస్ట్ గా నమ్మి చేస్తే విజయం వస్తుందనిని చెప్పడాని ఇది ఉదహరణ. ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాల అని హీరోయిన్, రైటర్ శాలినీ తెలిపారు.