తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో మంచు విష్ణు ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం లేదు. ఇలాంటి సమయం లోనే ఈయన భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ లాల్ , శరత్ కుమార్ , అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ కూడా కనిపించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యాడు. ఈయనకు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఈ చిత్ర బృందం తాజాగా పూర్తి చేసింది. దానితో ఈ మూవీ బృందం వారు ఈయనకు వీడ్కోలు చెప్పారు. అక్షయ్ కుమార్ నుండి ఎంతో నేర్చుకోవాలి అని , ఈ ప్రయాణం ఎంతో విలువైనది అని హీరో మంచు విష్ణు అన్నారు.

సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండడం ఇందులో ఎంతో మంది హేమా హేమీ అయిన నటి నటులు నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే మొదట ఈ సినిమాలో నయన తార ను ఓ పాత్రకు తీసుకున్నారు. కానీ ఈమె ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడంతో అదే స్థలంలో కాజల్ అగర్వాల్ ను ఈ మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mv