త్రిష ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో త్రిష తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ సినిమాల్లో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న విడ మయార్చి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.


మూవీ పై తమిళ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లతో పాటు ఈ బ్యూటీ లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న థగ్ లైఫ్ మూవీ లో కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న రామ్ మూవీ లో కూడా ఈ బ్యూటీ కనిపించబోతోంది. ఇక యువ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఐడెంటిటీ మూవీ లో కూడా త్రిష కనిపించబోతుంది. ఈ మూవీ లతో పాటు సోనీ లివ్ లో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోయే బ్రింద అనే వెబ్ సిరీస్ లో కూడా త్రిష ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇలా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: