ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకున్న నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ లో చాలా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అందులో సోలో మరియు ప్రతినిధి మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ ల ద్వారా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది.

ఇకపోతే ఈయన చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ తనకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను తీసుకు వచ్చిన ప్రతినిధి సినిమాకు కొనసాగింపుగా ప్రతినిధి 2 అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మొదట పోయిన నెల 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాను ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేస్తాం అని ఈ చిత్ర బృందం ప్రకటించింది.

ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ప్రతినిధి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రతినిధి 2 పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి చాలా కాలం గ్యాప్ తీసుకొని ప్రతినిధి 2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నారా రోహిత్మూవీ తో ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr