తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో వితిక ఒకరు. తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించకపోవడంతో ఆమెకు ఆ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. ఇక ఈమె సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సమయంలో టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి వరుణ్ సందేశ్ తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీళ్ళిద్దరూ తమ పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2016 వ సంవత్సరం చాలా గ్రాండ్ గా చాలా మంది మధ్య జరిగింది. ఇక ఈమెకు సినిమాల ద్వారా రాని గుర్తింపు పెళ్లి తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చింది. ఇక ఈమె బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బయటకు వచ్చాక మంచి క్రేజ్ కూడా వచ్చిన ఏ సినిమాల్లో నటించలేదు.

కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పోస్టులను చేస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తాను సినిమాలకు ఎందుకు దూరం కావలసి వచ్చింది అనే విషయాన్ని చెప్పింది. తాజాగా వితిక మాట్లాడుతూ ... 16 సంవత్సరాల వయసులో అమ్మతో కలిసి ఓ మూవీ ఆడిషన్ కి వెళ్ళగా నన్ను అక్కడ సెలెక్ట్ చేశారు. అయితే చాన్స్ ఇవ్వాలి అంటే నిర్మాతల నుంచి కమిట్మెంట్ ఒత్తిడి ఉంటుందని మా అమ్మ ఎదుటే చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేక క్రమంగా సినిమాలకు దూరం అయ్యా అని ఈ బ్యూటీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: