ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ముంబై లో ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇకపోతే మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను ముంబై లో తిరిగి ప్రారంభించారు. ఇక ముంబై లో కొన్ని రోజుల పాటు ఈ మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరగబోతున్నట్లు తెలుస్తుంది. తాజా ముంబై షెడ్యూల్ లో భాగంగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది.

ఇక ఈస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం వరుస పరాజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న రామ్ మరియు పూరి జగన్నాథ్ ఈ మూవీ తో తిరిగి కం బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: