లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం రూపొందిన ఇండియన్ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం శంకర్ "ఇండియన్ 2" అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటిస్తూ ఉండగా ... కాజల్ అగర్వాల్  , రకుల్ ప్రీత్ సింగ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... లేక ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇలా జూన్ నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాను జూన్ 17 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త కూడా వైరల్ కూడా అయింది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే ఈ సినిమాను జూన్ నెలలో పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో పోస్ట్ పోన్ చేసి ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: