బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . షారుక్ నటించిన మూవీలలో పోయిన సంవత్సరం పటాన్ మూవీ మొదట థియేటర్ లలో విడుదల అయింది . ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టింది. చాలా రోజుల నుండి అపజాయలను ఎదుర్కొంటున్న షారుక్ ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మూవీ తర్వాత ఈయన తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇందులో నయన తార , దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత షారుఖ్ , రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన డంకి మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకున్న షారుక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి అందుకోగల కారణాన్ని తాజాగా ఈయనే తెలియజేశాడు. తాజాగా షారుక్ మాట్లాడుతూ ... పోయిన సంవత్సరం చాలా బిజీగా గడిపాను. ఒళ్ళు అలిసిపోయేలా కష్టపడ్డాను. అందుకే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాను. ప్రస్తుతం ఐపిఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కి హాజరవుతూ టీమును ఉత్సాహ పరుస్తున్నాను. కొన్ని రోజుల తరువాతే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాను అని తాజాగా షారుక్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: