యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొరటాల శివతో సినిమాను అనౌన్స్ చేశాడు. కొరటాల శివ ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత శివ , ఎన్టీఆర్ తో సినిమా చేయనుండడంతో దాని ఎఫెక్ట్ దీనిపై ఏమాత్రం పడకుండా ఉండడం కోసం కథను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్లాలి అనే ఉద్దేశంతో చాలా రోజుల పాటు ఈ కథపై శివ కసరత్తు చేశాడు.

దానితో "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల అయిన తర్వాత చాలా కాలానికి దేవర సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా కథ చాలా పెద్దది , పాత్రల స్కోప్ ఇంకా పెద్దది. కాబట్టి దీనిని ఒక భాగంలో చెప్పలేము. అందుకే దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని కొరటాల వెల్లడించాడు. ఈ మూవీ మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం దేవర తో పాటు ఎన్టీఆర్ "వార్ 2" సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ ల షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ముగియబోతుంది.

చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనిని మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీన ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ క్రేజీ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిజంగానే ఈ మూవీ కనక స్టార్ట్ అయినట్లు అయితే ఇది ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: