కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కూలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఇక ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఫ్యాన్స్ లో ఎన్నో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఖైదీ, విక్రమ్ సినిమాలతో పాటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా దర్శకుడు లోకేష్ మంచి క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా తెలుగులో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.దీంతో ఇప్పుడు అతని నుంచి రాబోయే ఈ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ను విడుదల చేయగా బాగా ట్రెండ్ అయ్యింది.ఇక ఖైదీ,విక్రమ్ లాంటి టైటిల్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈసారి కూలి అంటూ రజనీకాంత్ 171 వ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ మునుపెన్నడూ లేని లుక్కుతో కనిపించబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు.


టీజర్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ దాడి చేయడం అలాగే వింటేజ్ డైలాగ్స్ తో ఆకట్టుకోవడం కూడా ఫాన్స్ కు మంచి కిక్  ఇచ్చింది.పైగా దానికి తోడు అనిరుద్ రవి చందర్ మ్యూజిక్ కూడా మరోసారి గట్టిగానే క్లిక్ అయింది. మొత్తానికి టీజర్ తోనే మరోసారి దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాకు మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేశాడు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షెడ్స్ లో ఉంటుంది అని కూడా ఇదివరకే లోకేష్ కనగరాజ్ వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఇప్పటి దాకా ఎక్కువగా తన మల్టీవర్స్ కథలతో వచ్చిన లోకేష్ ఈసారి మాత్రం అలా కాకుండా రజినీకాంత్ తో స్ట్రైట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఎలాంటి డ్రగ్స్ సీన్స్ కూడా ఉండవని తెలుస్తోంది. ఎక్కువగా గోల్డ్ కు సంబంధించిన స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు రైటర్ చంద్రు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: