గత ఎన్నికల్లో కూడా క్రికెటర్లను సినీ సెలబ్రిటీలను ఇలా ఎన్నికలలో బరిలోకి దింపిన బీజేపీ.. ఈసారి కూడా అదే చేసింది ఈ క్రమంలోనే చాలామంది సినీ సెలబ్రిటీలు ఎన్నికల బరిలో నిలవడంతో ఇక ఆయా సెలబ్రిటీల అభిమానులు కూడా ప్రచారంలో భాగం కావడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక మొన్నటి వరకు సినిమాల్లో డైలాగులు చెబుతూ మాత్రమే కనిపించిన సెలబ్రిటీలు.. ఇప్పుడు ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. పెద్దపెద్ద ప్రసంగాలు ఇస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కంగనా రనౌత్ కూడా ఒకరు.
హిమాచల్ ప్రదేశ్ లోని మండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగారు కంగనా రనౌత్. ప్రచారంలో దూసుకుపోతూ తన ప్రసంగాలతో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా రాజకీయాల్లోకి వెళ్లిన కంగనా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాలు చేస్తారా లేదా అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. ఈ విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు కంగనా. ఎన్నికల తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతాను అంటూ తెలిపారు. నేను సినిమాలు మానేస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ఇండస్ట్రీలో నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. త్వరలో ఎమర్జెన్సీ మూవీ విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న నమ్మకం ఉంది అంటూ కంగనా చెప్పుకొచ్చింది.