ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం అందుతోంది. 5 భాషల్లో ఈ సినిమా తెరకెక్కగా జూన్ నెల 7వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారని ఈ విధంగా చేయడం వాళ్ల జీవితాలపై ప్రభావం చూపుతుందని శిరిన్ శ్రీరామ్ కామెంట్లు చేశారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఆయన అన్నారు. తెలుగులో రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా చిన్న సినిమాల్లో సంచలనం సృష్టించి ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. చైతన్య స్రవంతి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేమించొద్దు మూవీతో శిరీన్ శ్రీరామ్ ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.