ఫీమేల్ యాంకర్స్ లేకుండా నేను షో చేయను. దానికి కారణం ఉంది. ఎందుకంటే నాకు మాత్రమే పేరు రావాలంటే నేను ఒక్కడినే షో చేయచ్చు. ప్రొడ్యూసర్ తో చెప్పి నేనొక్కడినే యాంకర్ గా ఉండాలంటే ఒప్పుకుంటారు.టాలీవుడ్ లో క్రేజీ యాంకర్స్ లో రవి ఒకడు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు, షోని హోస్ట్ చేస్తున్నప్పుడు రవి ఎనెర్జీ లెవల్స్ వేరేగా ఉంటాయి. టాలీవుడ్ లో అంతలా రవి పాపులర్ అయ్యాడు. అయితే రవి ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడానికి అతడి వివాదాలు కూడా ఒక కారణం.రవిపై ఎన్నో రూమర్స్, కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. తనతో కో యాంకరింగ్ చేసిన ఫీమేల్ యాంకర్స్ విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. ఓ యాంకర్ అయితే పరోక్షంగా రవి గురించి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అయితే రవి ఇప్పుడు ఆ కాంట్రవర్సీలు పక్కన పెట్టి తన పని తాను చూసుకుంటున్నాడు.అసలు ఫీమేల్ యాంకర్ తో ఎందుకు ఆ రేంజ్ లో రూమర్స్ వచ్చాయి అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో తలెత్తింది. రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షోకి రవి హాజరయ్యాడు. రీతూ ఈ ప్రశ్న అడిగింది. దీనికి రవి బదులిస్తూ.. ఫిమేల్ యాంకర్స్ లేకుండా నేను షో చేయను. దానికి కారణం ఉంది.

ఎందుకంటే నాకు మాత్రమే పేరు రావాలంటే నేను ఒక్కడినే షో చేయచ్చు. ప్రొడ్యూసర్ తో చెప్పి నేనొక్కడినే యాంకర్ గా ఉండాలంటే ఒప్పుకుంటారు. కానీ దాని వల్ల షోకి అందం రాదు. న్యూస్ ఛానల్స్ చూసేటప్పుడు మనం లేడి న్యూస్ రీడర్ ఉంటేనే చూస్తాం. జనరల్ గా సైకాలజీ అది. అదే విధంగా నా పక్కన ఒక ఫిమేల్ యాంకర్ ఉంటే.. ఆమె అందం, నా ఎనేర్జి వల్ల షోకి బ్యూటిఫుల్ గా మారుతుంది.ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనొక్కడినే ఉంటే ఎవరు చూస్తారు. నేను మంచి కంటెంట్ ఇవ్వగలను. కానీ ఆడియన్స్ చూసేలాగా చేయలేను. దానికి గ్లామర్ యాడ్ అవ్వాలి అని రవి అన్నాడు. నేను చాలా మంది ఫిమేల్ యాంకర్స్ తో వర్క్ చేయడానికి కారణం అదే.ఆ క్రమంలో నాపై చాలా రూమర్స్ వచ్చాయి. నన్ను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అదంతా షో కోసమే. ఇది జనాల్లోకి తప్పుగా వెళుతోంది అని భావించినప్పుడు ఇక ఫిమేల్ యాంకర్స్ తో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని డిసైడ్ అయినట్లు రవి పేర్కొన్నాడు. ఫిమేల్ యాంకర్స్ గ్లామర్ ఉపయోగించుకుని షోకి పాపులారిటీ తీసుకురావడం మాత్రమే తన ఉద్దేశం అని రవి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: