అయితే ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను వాడే వస్తువులను ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం సర్వసాధారణమే. దీనినే గ్రాఫిక్స్ అంటారు. ఇలా ఏ సినిమాలో చూసిన నేటి రోజుల్లో గ్రాఫిక్స్ తప్పకుండా కనిపిస్తోంది. కానీ నటీనటులు లేకుండానే సినిమా తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి నటీనటులు లేకుండా సినిమా ఎలా ఉంటుంది. అలా అయితే అది కార్టూన్ సినిమా అవుతుంది అంటారు ఎవరైనా. అయితే ఇక్కడ ఏకంగా నటీనటులు లేకుండానే ఉన్నట్లు కల్పించి సినిమా తీశారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రతి రంగంలో సంచలన మార్పులకు కారణం అవుతుంది.
ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో చిత్ర పరిశ్రమంలో కూడా సరికొత్త పోకూడదు ఇక ఏఐ కారణం కాబోతుంది అన్నది తెలుస్తుంది ఎందుకంటే ఇటీవలే నటీనటుల అవసరం లేకుండానే సినిమాలను నిర్మించగలుగుతుంది. న్యూయార్క్ లోని ఏఐ ఫిలిం ఫెస్టివల్లో తాజాగా ఒక పోటీ పెట్టగా.. 3 వేలకు పైగా ఏఐ లాగు చిత్రాలు వచ్చాయి. వీటిలో పది వీడియోలు ఎంపిక చేసి నిర్వాహకులు ప్రదర్శించారు. అయితే అవి ఇన్ సెప్షన్, మాట్రిక్స్, లవింగ్ మెన్షన్ మూవీలను గుర్తు చేశాయి అని తెలిపారు నిపుణులు. అయితే రానున్న రోజుల్లో పూర్తిస్థాయి సినిమాను కూడా నటీనటుల అవసరం లేకుండానే ఏఐ సాయంతో నిర్మించే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డారు నిపుణులు.