ఎర్లీ మార్నింగ్ కప్ కాఫీ తాగే అలవాటు ఉందన్నారు శోభన్‌బాబు. అయితే ఏవండి ఆవిడ వచ్చింది షూటింగ్ సమయంలో హోటల్లో కాఫీ అడిగాడట శోభన్‌బాబు కానీ కాఫీ రాలేదట. దీంతో షూటింగ్ టైమ్ అయిపోతుందని చెప్పి అలా కాఫీ తాగకుండానే వెళ్లిపోయాడట. మరో రోజు కూడా సేమ్ అలానే కాఫీ అడగ్గా వాళ్లు తేలేదట. మరి ఆ హోటల్లో పాలు లేవా? ఏంటో తెలియదు రెండు రోజులు ఇలానే జరిగింది.దీంతో హర్ట్ అయిన శోభన్‌బాబు కాఫీని మొత్తమే మానేస్తా పోలా అనుకున్నాడట. ఆ హోటల్ వాళ్లు చేసిన పనికి సోగ్గాడు కాఫీ తాగడమే మానేయాలనుకున్నాడట. రెండు రోజులు తాగకుండా ఉన్నాను, మున్ముందు కూడా ఎందుకు ఉండలేను, తాగడమే మానేస్తా పోలా అనుకున్నాడట. అంతే దాన్ని నియమంగా పెట్టుకున్నాడట. అప్పట్నుంచి, ఆ ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు కాఫీని టచ్ చేయలేదని చెప్పాడు శోభన్ బాబు.అయితే మధ్యలో ఓ తమాషా జరిగిందన్నారు. ఓ రోజు ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు అందులో హోస్టెస్ ఇచ్చే కాఫీ స్మెల్ అద్భుతంగా ఉందట. అది మనసు లాగేసిందట. కానీ మూడేళ్లుగా తాగడం లేను కదా ఎందుకు అనిపించిందట. వాళ్లు ఫోర్స్ చేయడంతో ఓకే అన్నాను, ఆమె కాఫీ కలిపి తన వద్ద పెట్టిందట. అప్పుడు కాఫీని దగ్గర తీసుకుని గట్టిగా స్మెల్ తీసుకుని అక్కడ పెట్టేశాడట. అలా తనని తాను కంట్రోల్ చేసుకున్నానని, ఏ అలవాటైనా లిమిట్‌గా ఉంటే పర్వాలేదు, అది అదుపుతప్పితేనే అరోగ్యం దెబ్బతింటుందని చెప్పాడు శోభన్‌బాబు. ఈ రేర్ వీడియో క్లిప్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.