మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం భద్ర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2005 వ సంవత్సరం మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో రవితేజ కు మీరా జాస్మిన్ కు బోయపాటి శ్రీను కు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఈ మూవీ తోనే బోయపాటి శ్రీను దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు.

ఇకపోతే బోయపాటి శ్రీను సినిమాకు దర్శకత్వం వహించాలి అనుకున్న తర్వాత రాసుకున్న ఈ కథను మొదట రవితేజకు కాకుండా మరో హీరోకు చెప్పాడట. ఆ హీరో కూడా ఈ సినిమా చేయాలి అని అనుకున్నాడట. కానీ లాస్ట్ మినిట్ లో ఈ సినిమాను ఆ హీరో రిజెక్ట్ చేశాడు. ఆ హీరో ఎవరు..? ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడో తెలుసుకుందాం. బోయపాటి శ్రీను "భద్ర" మూవీ స్టోరీని మొదటగా అల్లు అర్జున్ కు వినిపించాడు. ఆయన కూడా గంగోత్రి మూవీ తర్వాత ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయాలి అని అనుకున్నారట.

దానితో బోయపాటి చెప్పిన భద్ర మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో ఈయనతో కొన్ని రోజుల పాటు ఈ కథపై అల్లు అర్జున్ కూడా చాలా కసరత్తు చేసాడట. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది అనుకొనే సమయం లోనే సుకుమార్ ఆర్య సినిమా కథను , అల్లు అర్జున్ కి వినిపించడంతో భద్ర కంటే కూడా ఈ టైమ్ లో ఆర్య అయితేనే తన కెరీర్ కు బాగుంటుంది అని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు దానితో ఆర్య మూవీ ని మొదలు పెట్టి బోయపాటి దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది అని దిల్ రాజుకు చెప్పడం.

ఆ తర్వాత బోయపాటి, దిల్ రాజుకు ఆ కథను వినిపించడం ఆ కథ దిల్ రాజుకు నచ్చడంతో  రవితేజతో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని రవితేజకు ఈ మూవీ కథ చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలా అల్లు అర్జున్ హీరోగా రూపొందాల్సిన భద్ర మూవీ లో రవితేజ ఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: