పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు , యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీ లను ప్రారంభించి అందుకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో సినిమాల షూటింగ్ లను పక్కన పెట్టేసి రాజకీయాలతో ఫుల్ బిజీ అయ్యారు. దానితో దాదాపు రెండు , మూడు నెలల కంటే ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే పవన్ కేటాయించాడు.

ఇక నిన్నటితో ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి. ఇక పవన్ సినిమాలపై కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజుల పాటు రాజకీయ పనులతో ఎంతో ఒత్తిడి కి గురి అయిన పవన్ కొన్ని రోజుల పాటు కుటుంబం తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళనున్నట్లు అక్కడ కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపి రిసల్ట్ వచ్చే సమయానికి ఇండియాకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 4 వ తేదీన నిన్న జరిగిన ఎలక్షన్ లకి సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే పవన్ షూటింగ్ లకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు మూవీ లకు సంబంధించిన షూటింగ్స్ చాలా వరకు కంప్లీట్ కావడంతో పవన్ తీరిక లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ ను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే హరిహర వీరమల్లు మూవీ ని ఓ జి మూవీ ని ఇదే సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: