తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో సత్య దేవ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో మెప్పించాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండడంతో ఈయన నటనకు ప్రత్యేకమైన ఇమేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా సత్య దేవ్ "కృష్ణమ్మ" అనే సినిమాలో హీరో గా నటించాడు. వి వి గోపాల కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 20 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లు వచ్చాయి. కానీ ఈ మూవీ కి మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు అలాగే ఈ మూవీ కి మొదటి రోజు కంటే రెండవ రోజు అధిక కలెక్షన్ లు వచ్చినట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ సమర్పించాడు. ఇక ఈ మూవీ ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ ద్వారా సత్య దేవ్ కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: