టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా అప్పట్లో విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ కెరియర్లో మూడవ సినిమాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి

 భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల ఎప్పుడెప్పుడు అవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు పుష్ప టు ఫస్ట్ సింగిల్ ను మించేలా దేవర ఫస్ట్ సింగిల్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక దానికోసం అనిరుద్ సైతం అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వినబడుతున్నాయి. ఇక అనిరుద్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ తమిళంలో సక్సెస్

 అయినంత మాత్రం తెలుగులో సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పొచ్చు. దేవర సినిమాతో అనిరుధ్ కు తెలుగులో ఆ లోటు కూడా తీరబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు ఒకింత కసితో పని చేస్తున్నారని తెలుస్తోంది. దేవర సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన కాగా ఒకరోజు ముందే దేవర ఫస్ట్ సింగిల్ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. తారక్ పుట్టినరోజున షాకింగ్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఆనందించేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: