నేషనల్ క్రష్ రష్మిక మందన మలయాళ సినిమా అయినటువంటి కిరిక్ పార్టీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ ను చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత ఈమెకు గీత గోవిందం విజయం దక్కడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమెకు అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా రష్మిక ముంబై ట్రైన్స్ హెర్బల్ లింక్ పై ప్రయాణించింది. ఈ ట్రైన్స్ పై ప్రయాణించిన తర్వాత రష్మిక తన అనుభవాన్ని పంచుకుంది.

కొన్ని సంవత్సరాల క్రితం ముంబై నుంచి నవి ముంబై వెళ్లేందుకు రెండు గంటల సమయం పట్టేది ... కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే వెళ్ళిపోతున్నాం. ఇది చాలా గొప్ప విషయం అని ఓ ఇంటర్వ్యూలో రష్మిక చెప్పుకొచ్చింది. అలా రెండు గంటల ప్రయాణ సమయం ఉన్న టైం లో 20 నిమిషాల్లోనే వెళ్లే రోజులు వస్తాయి అని మనం అనుకున్నామా ..? అని ఈమె ప్రశ్నించింది. భారత్ అభివృద్ధి లో దూసుకుపోతుంది.

దాన్ని ఎవరు ఆపలేరు అని రష్మిక చెప్పుకొచ్చింది. అలాగే ప్రజలు ప్రగతికే ఓటేయాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చింది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈమె కొన్ని రోజుల క్రితమే సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన సికిందర్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీ ఎంపిక అయింది. ఈ మూవీపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: