ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా తాజాగా తమిళంలో రూపొందిన "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో మే 3 వ తేదీన "అరుణ్మనై 4" అనే పేరుతో విడుదల కాగా తెలుగు లో ఈ సినిమా బాక్ అనే పేరుతో ఇదే తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది.

ఇక ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తున్నప్పటికీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ లాభాలను అందుకుంది. ఇక ప్రస్తుతం కూడా ఈ మూవీ అనేక ప్రాంతాలలో మంచి కలెక్షన్ లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇలా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే హిందీ లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ హిందీ విడుదలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మరో ఒకటి , రెండు వారాల్లో ఈ సినిమా హిందీ విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: