అయితే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. వరుసగా సక్సెస్ లు వస్తున్నప్పుడు హీరోల రెమ్యూనరేషన్ అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. కానీ అదే హీరో ఫ్లాపుల బాట పట్టాడు అంటే చాలు పారితోషకం తగ్గించుకోకపోతే ఆ హీరోతో సినిమా చేయడానికి కూడా ఏ డైరెక్టర్ ముందుకు రారు. దీంతో ఇలా వరుసలాపులతో పారితోషకం కూడా అంతకంతకు తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ బాలీవుడ్లో ఒకప్పుడు యంగ్ స్టార్ హీరోగా హవా నడిపించిన ఒక నటుడుకి ఇక ఇప్పుడు పారితోషికం అమాంతం తగ్గిపోయింది అన్న వార్త వైరల్ గా మారిపోయింది.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కి ఎంత మంచి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అతను చేసే యాక్షన్ సీన్స్ కి అయితే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారూ. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు ఈ బాలీవుడ్ హీరో. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దీంతో తన రెమ్యూనరేషన్ భారీగా కట్ చేసుకున్నాడు టైగర్స్ ష్రాఫ్. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 30 కోట్ల వరకు తీసుకున్న ఆయన.. ఇప్పుడు కేవలం ఒక్క సినిమాకి 9 కోట్లు మాత్రమే అడుగుతున్నాడు. ఏదైనా సినిమా హిట్ అయితే మళ్లీ పారితోషకం పెంచాలని చూస్తున్నాడట.