టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో శతమానం భవతి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. 2017 వ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా తెలుగు కుటుంబాలను అత్యంత ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ గా శతమానం భవతి 2 అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇక తాజాగా దిల్ రాజు "శతమానం భవతి 2" సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ను ఇచ్చారు. తాజాగా ఈయన ఒక చోట మాట్లాడుతూ ... శతమానం భవతి 2 సినిమాకు సంబంధించిన చాలా పనులు కంప్లీట్ అయ్యాయి.

ఈ సినిమాకు రైటర్ అయినటువంటి హరి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించబోతున్నాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక దీనితో శతమానం భవతి 2 సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. శతమానం భవతి సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో శతమానం భవతి 2 పై కూడా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: