దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏ సినిమా తీసిన అది పక్క బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరులోనూ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది స్టార్ హీరోలు ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ హీరోల రేంజ్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి. బాహుబలి మూవీ తో ప్రభాస్ కరీర్ ని చక్కదిద్దిన జక్కన్న అనంతరం త్రిబుల్ ఆర్ మూవీ తో రామ్ చరణ్ మరియు తారక్ కెరీర్ లని పూర్తిగా మార్చేశాడు.

ఒకానొక సమయంలో ఈ ముగ్గురు హీరోలు కూడా అడపాద అడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగే వారు. కానీ ఎప్పుడైతే జక్కన్నతో సినిమా చేశారో అప్పటినుంచి వీరికి వరస పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. ఇక ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి  ఈ సినిమా లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో వన్ ఆఫ్ ది కీ రోల్ కోసం ఆలియా భట్ని చూస్ చేసుకున్నారట రాజమౌళి. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సినిమాలో రాజమౌళి ఆలియా కలిసి వర్క్ చేశారు.


కానీ ఆ మూమెంట్లో కొన్ని సీన్స్ ఎడిటింగ్లో లేపేసారట. ఈ కారణంగానే ఆమెకు పెద్దగా పాపులారిటీ దక్కలేదు. దీంతో రాజమౌళి పై ఆలియా భట్ చాలా కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు సినిమాలో ఆలియా భట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ ఆలియా మాత్రం ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిందట. అయితే జక్కన్న రోల్ కి ఆమె బాగుంటుంది అంటూ రిక్వెస్ట్ చేసి మరి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడట. అయినప్పటికీ ససేమేరా ఆలియా భట్ ఒప్పుకోకపోవడం విశేషం. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి జక్కన్న రిక్వెస్ట్ చూసి అయినా ఆలియా భట్ ఈ మూవీకి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: