మే 31 వ తేదీన మంచి అంచనాల నడుమ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన గం గం గణేశా , కార్తికేయ హీరో గా రూపొందిన భజే వాయు వేగం సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాల విడుదలకు ముందు ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన విడుదల అయిన ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. 

 వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్ హీరోగా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. కానీ రెండవ రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు పడిపోయాయి. ఇక బేబీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన గం గం గణేశా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది.

 దానితో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన స్థాయి కలెక్షన్లే రెండవ రోజు కూడా వచ్చాయి. ఇకపోతే "బెదురులంక 2012" లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కార్తికేయ హీరోగా రూపొందిన మూవీ కావడంతో భజే వాయు వేగం సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ మూవీ కి మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు భారీగా కలక్షన్ పెరిగాయి. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూడు మూవీ లలో భజే వాయు వేగం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: