అయితే అందుతున్న సమాచారం మేరకు రవినా టాండన్ కారుతో యాక్సిడెంట్ చేసిన మహిళలను బయటికి వచ్చి మరి వారిపైన దాడి చేసిందని అక్కడ ఉన్న స్థానికులు సైతం తెలియజేస్తున్నారు.. తన పేరు మహమ్మద్ తాను బాంద్రా నివాసిని అని తన అమ్మ చెల్లి తదితరులతో కలిసి బయటికి వెళుతున్నాము అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా నటి రవినా టాండన్ కారు మా అమ్మను ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో ఆమె ముక్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత రవీనా టాండన్ కారు డ్రైవర్ మా అమ్మను కొట్టారని..
ఆ వెంటనే మద్యం మత్తులో ఉన్న రవినా కూడా బయటికి వచ్చి తన తల్లి పైన దాడి చేసినట్లుగా తెలియజేశారు. ఈమె పైన ఫిర్యాదు చేయడానికి నాలుగు గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయట నిలుచున్నామని అయితే ఎవరు వినిపించుకోవడంలేదని కేవలం రాజీ అంటూ చెబుతున్నారు అంటూ బాధితులు తెలియజేస్తున్నారు. తనకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని మహమ్మద్ ఈ వీడియోలో తెలియజేశారు. అలాగే రవీనా టాండన్ చుట్టూ చాలామంది గూమికూడి ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే రవినా పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె దయచేసి తనని కొట్టవద్దు అంటూ అక్కడున్న వారిని వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.