ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం పుష్ప 2. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ యొక్క మొదటి భాగానికి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. తన నటనతో మెప్పించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకుని పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

దీంతో పుష్ప సీక్వెల్ పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఇక పుష్ప సినిమాలో నటుడు అజయ్ ఘోష్కి మంచి గుర్తింపు దక్కిందని చెప్పుకోవచ్చు. కాకపోతే పుష్ప ఫస్ట్ పార్ట్ లోనే అజయ్ గోష్ పాత్రకి ఎండింగ్ కార్డ్ పడింది. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్లో అజయ్ ఘోష్ పాత్ర ఉండదు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్ ఇదే విషయం చెప్పుకొచ్చారు. ఈయన మాట్లాడుతూ.." పుష్ప 2 లో నా పాత్ర లేదు. నేను నటించలేక పోయాను అనే బాధ లేదు.

నా కెరీర్ కతం అయ్యింది అనుకుంటున్నా సమయంలో పుష్ప లో కొండ రెడ్డి పాత్ర నాకు నిజంగా పునర్జీవనాన్ని ఇచ్చింది. నాకు ఆ సంతృప్తి చాలు " అంటూ తెలిపారు. ఇక ఏది ఏమైనా పుష్ప సీక్వెల్ కోసం ఫాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్ట్ 15, 2024న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సీక్వెల్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 లో నా పాత్ర లేదు. నేను నటించలేక పోయాను అనే బాధ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: