తాజాగా శర్వానంద్ మనమే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.  ఈ చిత్రం నుండి విడుదల చేసిన పాటలు మంచి హిట్ ను అందుకున్నాయి. కాగా ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో  తెరకెక్కుతుంది. మేకర్స్ రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ ట్రైలర్ను చూసిన అభిమానులకు దీనిపై మరింత అంచనాలు

  పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రం అభిమానుల ముందుకు రావడానికి  సిద్ధంగా ఉంది. జూన్ 7 న  ప్రేక్షకుల ముందుకు రానుంది . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ   టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. శర్వానంద్, కృతి శెట్టి వీళ్ళ ఇద్దరి కాంబోలో మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో

 చూడాలి. ఇదిలా ఉంటే  ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను అందుకుంది. ఇక వరస సినిమాలు చేసే సమయంలో ది వారియర్ సినిమా ద్వారా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కృతి శెట్టి కి అంతా ఆఫర్స్ రాలేదు. తను సినిమాలో అంతగా అలరించ లేకపోయినప్పటికీ కూడా అభిమానులలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమా కృతి శెట్టి కి ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: