హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నిఖిల్. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ను అందుకున్నాడు. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమాతో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు ఈ టాలెంటెడ్ హీరో. దాని తర్వాత 18 పేజీస్ లాంటి లవ్ స్టోరీ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. దాని తర్వాత భారీ అంచనాలతో ఫ్యాన్ ఇండియా రేంజ్ తో రిలీజ్ చేసిన స్పై సినిమా నిరాశపరిచినప్పటికీ అఖిల్ నటనకు మంచి ప్రశాంశాలు

 దక్కాయి. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నిఖిల్. ఆ సినిమానే 'స్వయంభూ' . పిరియాడికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఇది కాసేపు పక్కన పెడితే శనివారం జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్వయంభూ సినిమాకు

  సంబంధించిన నిఖిల్ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక  ఆ పోస్టర్లో నిఖిల్ కత్తి తిప్పుతూ యోధుడి లుక్ లో సూపర్ గా కనిపించాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ సినిమా షూటింగ్ టైమ్ లో నిఖిల్ పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించారు. ఆ వేడుకలో నిఖిల్ యుద్ధం చేసే పెద్ద కత్తితో తన బర్త్డే కేక్ ను కట్ చేయడం విశేషం. తాజాగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే స్వయంభూ ను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలలో పనిచేసిన కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు టోగ్రాఫర్ గా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రవి బ్రసూర్ స్వరాలు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయినట్లు తాజా సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: