తాజాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా. అంతేకాకుండా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను శనివారం సాయంత్రం చెన్నైలో చాలా గ్రాండ్ గా జరుపుకుంన్నారు. ఆ ఈవెంట్ లో చాలామంది గెస్ట్ లు కూడా వచ్చారు . హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏపియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్

 
నారంగ్, ముఖ్య అతిధులు ఆ కార్యక్రమానికి వచ్చి ఈ సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. అంతేకాకుండా శృతిహాసన్ , మౌనీ మౌయ్, శంకర్ కూతురు అదితి మరియు కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్ చేసి అందరినీ మెప్పించారు. అయితే ఆ ఈవెంట్ లో కమల్ హాసన్ ఇలా మాట్లాడుతూ.....'28 ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమా సీక్వెల్ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా సుభాస్కరన్ మాకు అండగా నిలిచారు. ఇక ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. అంతేకాకుండా మాకు సపోర్ట్ చేసిన


 ఉదయనిది స్టాలిన్ ,తమిళ కుమారన్ , సెంబగ మూర్తికి థాంక్స్ చెబుతూ కాజల్, రకుల్ , సిద్ధార్థ్ ,ఎస్ జె సూర్య , సముద్రఖని వీళ్ళందరూ అద్భుతమైన పాత్రలు చేశారు'అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ...... 'ఇండియన్ తాత మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను కమల్ హాసన్ చేయడం అసలు మామూలు విషయం కాదు. 360 డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు ఆయన. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఆయనతో కలిసి ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలు చేయడం నాకెంతో సంతోషంగా ఉంది'. అంటూ చెప్పుకొచ్చారు శంకర్. అంతేకాకుండా  కాజల్ ,రకుల్ ప్రీతిసింగ్ బ్రహ్మానందం ,బాబీ సింహ ఈ సినిమాలో పలు పాత్రలు నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: