టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప టు తో బిజీగా ఉంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే విడుదల కూడా కాబోతోంది. ఇక ఇటీవల పుష్ప నుండి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేశారు మేకర్స్. అందులో శ్రీవల్లి తన డాన్స్ తో అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కూడా ప్రస్తుతం ఇదే పాట వినపడుతోంది. దాంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అయితే శ్రీవల్లి సినిమాలతో ఎంత బిజీగా

 ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ లైఫ్ స్టైల్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో నిలిచింది రష్మిక మందన. ఇక అసలు విషయం ఏంటంటే.. రష్మిక మందన విజయ దేవరకొండ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది .అయితే ఈ తరహాలో వీళ్ళిద్దరిపై రూమర్స్ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎప్పుడూ ఆ రూమర్స్ పై స్పందించలేదు. అయితే తాజాగా ఇప్పుడు రష్మిక మందన ఒక విషయంలో టంగ్ స్లిప్ అయింది.

 అదేంటంటే ఇటీవల ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  రష్మిక మందన వచ్చింది. అందులో పొరపాటున టంగ్ స్లిప్ అవుతూ అరే మనం మనం ఒక ఫ్యామిలీ రా అని చెప్పింది. అప్పుడే అందరికీ అర్థం అయింది. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందుకే రష్మిక మందన ఈ మాట చెప్పింది అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రష్మిక మందనా ను విజయ దేవరకొండ ఏమని పిలుస్తాడో అన్న విషయం కూడా సోషల్ మీడియాలో వినబడుతుంది. అయితే రష్మిక మందన ను విజయ్ దేవరకొండ ముద్దుగా రషి అని పిలుస్తూ ఉంటాడట. ఫోన్ లో కూడా ఇదే పేరుతో రష్మిక పేరుని సేవ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: