త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతోంది. ఇకపోతే గత మూడు సంవత్సరాలుగా దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతూనే వస్తోంది. అయితే శంకర్ కేవలం ఈ ఒక్క సినిమానే కాకుండా దీంతోపాటు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ టు సినిమా కూడా తీస్తున్నాడు. ఈ సినిమా పై కంటే ఇండియన్ 2 సినిమా పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న

 శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ ను డిలే చేస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల ఇండియన్ టు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఇండియన్ టు విడుదల కోసం సిద్ధంగా ఉంది. అయితే షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు గేమ్ చేంజర్ పై దృష్టి పెట్టాడు శంకర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ లో వేగం పెంచాడు. అయితే మొన్నటి వరకు వరుస షెడ్యూల్ పూర్తి చేసుకుంటూ ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం కొంచెం గ్యాప్ తీసుకుని ఇండియన్ టు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు శంకర్. దాంతో మల్లి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి బ్రేక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే గేమ్ చేంజర్ కి సంబంధించిన నెక్స్ట్

 షెడ్యూల్ జూన్ 7 లేదా 9 నుండి మళ్లీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు రాజమండ్రిలో దీనికి సంబంధించిన షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇంకెన్ని రోజులు ఈ సినిమా కోసం టైం పడుతుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరొక నెల రోజుల సమయం దొరికితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అన్న సమాచారం వినబడుతుంది. ఇక ఆ 30 రోజుల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కేవలం పది రోజుల షూటింగ్ చేస్తే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోతుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: