కామెడీ టైమింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన నటించే కామెడీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది  అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధమాకా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత చేసిన రెండు మూడు సినిమాలతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అలాంటి జానర్ లోనే మరో కామెడి ఎంటర్టైనర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం

 వినబడుతోంది .ఇటీవల మాస్ మహారాజా రవితేజ ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే అందులో రవితేజ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది.  తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారట మేకర్స్. అంతేకాదు ఈనెల 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా

 స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. ఇక రవితేజ కెరియర్లో 75వ సినిమాగా ఈ మూవీ రాబోతోంది. ఆర్ టి 15 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలంగాణ ఈ యాసలో ఉండబోతుందట. తెలంగాణ యాసలో చాలా వరకు డైలాగ్స్ చెప్పబోతున్నాడట మాస్ మహారాజా రవితేజ. అంతేకాదు ఇందులో హీరోయిన్గా కూడా శ్రీ లీలను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వినబడుతోంది.  కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమాలోని రవితేజ క్యారెక్టర్ ను పరిచయం చేశారు టీం. ఇందులో భాగంగానే ఇప్పుడు సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: