టైర్ 2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన 35వ సినిమా మనమే తో ఫుల్ బిజీగా ఉన్నాడు. జూన్ 7న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. గత కొంత కాలం నుండి శర్వానంద్ చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారడంతో ఈ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్. మరి ఈ సినిమాతో నైనా హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. అయితే

 శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై రామ్ స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కృతి  ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. దాంతో కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్

 ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. శర్వానంద్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్.. నిన్న సినిమా చూశాను.. ఆయన చేసిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది.. ఆయన ఎక్స్పీరియన్స్ ఎంతుందో ఈ సినిమాలో కనిపించింది.. ఇందులో నాకు ఒక ఫేవరెట్ సీన్ కూడా ఉంది.. ఆ సీన్ కోసం నేను ఎప్పటినుండో వెయిట్ చేసాను.. ఎలా చేయాలి ఏంటి అని రోజు దాని గురించి ఆలోచించే దాన్ని..  కానీ శర్వానంద్ గారు మాత్రం చాలా సింపుల్ గా వచ్చి ఆ సిన్ ఒకే ఒక్క నిమిషంలో చాలా అద్భుతంగా కంప్లీట్ చేశారు.. నేను అది చూసి షాక్ అయిపోయాను.. శర్వానంద్ గారితో నా పర్ఫామెన్స్ ను మ్యాచ్ చేయడం చాలా కష్టంగా మారింది.. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకు వచ్చింది బేబమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: