చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బలగం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో జాక్పాట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సినిమా సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది అని చెప్పాలి. అయితే చివరిగా ఈ బ్యూటీ ఉస్తాద్

 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ఇప్పుడు ఆమెకి ఆఫర్లు తగ్గాయి అని అంటున్నారు. అందుకే  సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియా నీ వేదికగా చేసుకొని రకరకాల ఫోటోషూట్ సర్ చేస్తూ హాట్ హాట్ గా కనిపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది కావ్య కళ్యాణ్రామ్. అయితే తాజాగా తనకి ఒక బడా ప్రాజెక్టు వచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అది కూడా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కావ్య సొంతం

 చేసుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రోహిత్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు హీరోయిన్ ఎవరా అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కావ్యా ను ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మెగా మేనల్లుడు తో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఇక బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో మళ్ళీ అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలి అంటూ ఆమె అభిమానులు ఆశిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: