నాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా ఆగస్టులో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే నిర్మాత డివివి దానయ్య బడ్జెట్ లిమిటేషన్స్ కారణంగా ఈ ప్రాజెక్టు నుండి తప్పకుండాట్లుగా సమాచారం వినబడుతోంది. ఇందులో

 భాగంగానే ఇప్పుడు ఈ ప్రాజెక్టును తీసుకోవడానికి మరొక ఇద్దరు నిర్మాతలు రేసులో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నాడట. సుజిత్ కి చాలామంది నిర్మాతలకు కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా ఏవీ జరగడం లేదు అని అందుకే కొత్త నిర్మాతలను ఇందులోకి లాగకుండా సినిమానే పక్కన పెట్టేయాలి అని సినిమా నుండి తప్పుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే నాని తన

 తదుపరి సినిమా పై దృష్టి పెట్టాడట. అయితే ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే నాని తదుపరి సినిమా కోసం దాదాపుగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నట్లుగా వినికిడి. ఇక ఇంత బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే శ్రీకాంత్ ఓదెల. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మరోసారి అదే డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు నాని. మరి దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబో  రానున్న సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: