చిన్న రౌడీ హీరోగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ సినిమా గం గం గణేశ. ఉదయ భూమ్మిశెట్టి  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని నాగ వంశీ కారుమంచి నిర్మించారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగం తో కలిసి నిర్మించిన ఈ సినిమా యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చింది. కాగా ఈనెల 31న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కద పాతదే అయినప్పటికీ టేకింగ్ హీరో యాక్టింగ్ బాగుండడంతో ప్రశంసలను

 అందుకున్నాయి. అంతేకాదు సినిమాలోని కామెడీ అలాగే ట్విస్ట్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనీ సినిమా చూసిన వారందరూ రివ్యూ ఇచ్చారు.  అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గం గం గణేశ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సొంతం చేసుకున్నట్లుగా సమాచారం వినబడుతుంది. అంతేకాదు ఇందుకోసం భారీగా చెల్లించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత 30 రోజుల తర్వాత ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా

 సమాచారం వినబడుతోంది. కలెక్షన్ టాక్ పరంగా మంచి మార్కులే తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవక పోయినప్పటికీ జూలై మొదటి వారంలో ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇక ఈ సినిమాలో నయన సారిక ప్రగతి శ్రీనివాస హీరోయిన్గా కనిపించారు. అలాగే జబర్దస్త్ ఇమ్మానుయేల్ బిగ్బాస్ ప్రిన్స్ యావర్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఓవరాల్ గా సినిమా బాగున్నప్పటికీ సినిమాలోని పాటలు మాత్రం అంతగా బాగాలేదు అని సినిమా చూసిన వారందరూ రివ్యూ ఇచ్చారు. మరి థియేటర్స్ లో బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలా ఉండబోతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: