బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈమె కేవలం హిందీలోనే కాకుండా ప్రస్తుతం తెలుగులో కూడా  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఈ సినిమా కంటే ముందు రెండు మూడు తెలుగు సినిమాలు చేసి మంచి విజయాన్ని సంపాదించుకుంది. మరి ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో అని ఆమె అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా దీపిక ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద

 ఎత్తున వార్తలు వస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో భాగంగానే ఆమె చేసిన ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే కల్కి సినిమాలో నటించిన ఈమె ఎందుకు సినిమా ప్రమోషన్స్ లో రావడం లేదు.. అసలు సినిమాను దీపిక ఎందుకు ప్రమోట్ చేయడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు దీపికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ సంవత్సరం దీపిక బాలీవుడ్ లో పెద్దగా సినిమాల చేయడం లేదు. ఇప్పటికే ఆమె నటించిన ఫైటర్ సినిమా విడుదలై పెద్దగా ఆడలేదు. రితిక్ అండ్ దీపికా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా జనాలను

 ఊహించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు కల్కి సినిమా పైనే తన ఆశలు పెట్టుకుని దీపిక పురాణాలతో ముడిపడిన ఫ్యూచరిస్టిక్ పాత్రలో కనిపించబోతోంది.  అయితే మొన్నటివరకు హీరోయిన్గా దీపికకు ఈ సినిమాలో బాగానే క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బుజ్జి కి వాయిస్ చెప్పినా కీర్తి సురేష్ ఖాతాలోకి ఆ క్రెడిట్ మొత్తం వెళ్ళింది. అయితే ఇటీవల బుజ్జి కి సంబంధించిన ఈవెంట్ నిర్వహించారు.  అయితే అందులో కూడా దీపికా పదుకొనే ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో అసలు దీపికా సినిమాను ప్రమోట్ చేస్తారా ప్రమోషన్స్ లో పాల్గొంటారా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసిన దీపిక తెలుగులో డబ్బింగ్ చెప్పిందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే దీపిక సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీగా మారనున్నారు అని చిత్ర బృందం తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: