తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలో కూడా స్టార్ గా వెలుగొందారు ఆయన. సినిమాల్లో నటించే సమయంలోనే నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిశివరన్ అనే పేరు పెట్టారు. అయితే కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రఘువరన్ రోహిణి 2004లో విడిపోయారు. ఇక చివరి రోజుల్లో ఆల్కహాల్ కు బానిసగా మారిపోయిన రఘువరన్ 2008 మార్చ్ 19వ తేదీన కన్నుమూశారు.
అయితే ఈ మధ్యకాలం లో స్టార్ కిడ్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయమై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ట్రెండీ విలన్ రఘువరన్ కుమారుడు రిషి వరుణ్ కూడా తండ్రి బాటలోనే దూసుకు వెళ్తున్నాడు. 26 ఏళ్ల ఈ స్టార్ కిడ్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. ఇలా తండ్రిలా నటన లో కాకుండా సంగీతంలో సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని ఇంగ్లీష్ ఆల్బమ్ లు కూడా రిలీజ్ చేశాడు. అయితే రఘువరన్ కి కూడా సంగీతం పై ఎంతో ఆసక్తి ఉండేది కానీ సినిమా అవకాశాలు పెరగడంతో బిజీ అయిపోయి తనలోని మ్యూజిక్ టాలెంట్ పై దృష్టి సారించ లేకపోయాడు. కానీ ఇప్పుడు తండ్రి కోరికను కొడుకు నెరవేరుస్తున్నాడు.