అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్స్‌లో ఒకటైన ఐహార్ట్ రేడియోలో ది చంద్రికా రవి షో వినిపించనుంది. ఈ షోను ప్రమోట్ చేయడం కోసం చంద్రికా రవి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘‘ఇప్పటివరకు విడుదలయిన చాలా వరకు ప్రమోషన్స్‌ను నేనే ఎడిట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. దీనివల్ల కాస్త ఒత్తిడి అనిపిస్తోంది కానీ చాలా సంతోషంగా కూడా ఉంది. కెమెరా వెనుక ఉండడం అనేది నాకొక కొత్త అనుభవం. ఇన్నేళ్లలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు అసలు నేను ఎవరు అని ప్రేక్షకులకు తెలుస్తుంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది చంద్రికా రవి. సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందు చంద్రికా రవి.. రేడియోలో ఎన్నో లైవ్ షోలు, టీవీలో కూడా పలు షోలను హోస్ట్ చేసింది. ప్రేక్షకులతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం చంద్రికాకు ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు అదే తరహాలో అమెరికాలో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి ఇండియన్ ఉమెన్‌గా రికార్డ్ సాధించింది. ‘‘ఇందులో నేను మొదటి వ్యక్తి అయ్యిండొచ్చు కానీ చివరి వ్యక్తి మాత్రం కాదు. కేవలం నా వాయిస్‌తోనే ఈ ప్రపంచానికి నేనేంటో చెప్పగలగడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపింది చంద్రికా రవి. ది చంద్రికా షో అనేది అమెరికాలోని పెద్ద నెట్వర్క్స్ అయిన ఐహార్ట్ రేడియో, రుకుస్ అవెన్యూ రేడియోలో ప్రతీ గురువారం ఉదయం 7.30కు ప్రసారమవుతుంది. అంతే కాకుండా ప్రతీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో కూడా విడుదల కానుంది.