దర్శక ధీరుడు రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అవనీంద్ర  డైరెక్టర్ గా మారినా సినిమా లవ్ మౌళి. చాలా కాలం గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రంతో దర్శడిగా పరిచయం అయ్యాడు అవనీంద్ర. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్, టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. జూన్ 7న శుక్రవారం లవ్ మౌళి మూవీ విడుదల కానుంది. కానీ విడుదలకు మూడు రోజుల ముందుగానే వైజాగ్ లో లవ్ మౌళి సినిమా ప్రీవ్యూ షో వేశారు.


ఈ షోలపై వచ్చే స్పందన పై లవ్ మౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను డైరెక్టర్ మీడియాతో పంచుకున్నారు. " ఇటీవల వైజాగ్ లో లవ్ మౌళి ప్రత్యేక షో వేయడం జరిగింది. ఈ షోకు ట్రామండర్ ‌ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వాళ్లకు షో వేస్తే అందరూ బాగుందనే అంటారు. బాలేదని ఎవరూ చెప్పలేదు. అందుకే కొంతమంది చెప్పేదే నేను నమ్ముతాను. కీరవాణి గారి బ్రదర్ కంచి గారు ఏమన్నా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. అలాంటివారు ఓపెన్ గా ఈ సినిమా బాగుందని చెప్పారు.


ఇక ఈ సినిమాకి అమ్మాయిలు అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వారి నుంచి వచ్చే స్పందన అంతా ఇంతా కాదు. అమ్మాయిలు ఈ విధంగా కనెక్ట్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు " అంటూ తెలియజేశాడు రాజమౌళి శిష్యుడు. ప్రజెంట్ ఈ డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలు చూసిన వారంతా.. నువ్వు కూడా రాజమౌళి అంతా ఎత్తుకి ఎదగాలని మేమందరం ఆశిస్తున్నాను. జక్కన్న అసిస్టెంట్ అంటే మినిమం ఉంటుంది. జక్కన లాగానే మీ క్రియేటివిటీ ని కూడా చూపించి టాలీవుడ్ లో మంచి స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ బ్రో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: