తన పిల్లలు ఆధ్య, అకీరా గురించి కూడా రేణూ దేశాయ్ మాట్లాడారు. వాళ్ల మనస్థత్వాల గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆధ్య, అకీరా.. ఇద్దరికీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అకీరా చాలా ప్రశాంతంగా ఉంటాడు. యోగా, కలరిపయట్టు లాంటివి చేస్తుంటాడు. ఇప్పటికీ ఈ విషయం వందసార్లు చెప్పాను. ఇప్పటివరకు అకీరాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, హీరో అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తన ఆలోచన ఎప్పుడు మారితే అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ విషయం ప్రకటిస్తాను. ప్రేక్షకులు వాళ్లలో వాళ్లు అనుకోవడం మానేయాలి. అకీరా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. తన అన్నదమ్ముళ్లు, నిర్మాతలు ఎవరూ తనను సినిమాల కోసం సిద్ధం చేయడం లేదు’’ అని చెప్పుకొచ్చారు రేణూ.‘‘అకీరా నటిస్తే నేనే బ్యాండ్ బాజాతో తను హీరో అవుతున్నాడని ప్రకటిస్తాను. ప్రతీ రెండు నెలలకు తను ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అందరూ నన్ను అడుగుతున్నారు ఏం చెప్పను అని తనను అడిగినా కూడా అమ్మ నేను హీరో అవ్వాలని అనుకోవడం లేదు అంటాడు. భవిష్యత్తులో ఇంట్రెస్ట్ వస్తుందా అంటే భవిష్యత్తు గురించి నాకెలా తెలుస్తుంది అంటాడు. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. కొంతకాలం వేరే మ్యూజిక్ డైరెక్టర్లకు అసిస్టెంట్‌గా చేశాడు. ఎక్కువగా హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అస్సలు నచ్చదు’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పారు రేణూ దేశాయ్.