తమిళ నటుడు భరత్ తాజాగా మిరల్ అనే హార్రర్ జోనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చాలా రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయింది. ఇక ఈ మూవీ ఇప్పటికే తమిళ భాషలో ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లోకి అందుబాటు లోకి వచ్చాక కొన్ని రోజుల తర్వాత తెలుగు లో ఈ సినిమాలు థియేటర్ లలో విడుదల చేశారు.  

ఇక పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ సినిమా చాలా తక్కువ రోజుల లోనే తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా జూన్ 7 వ తేదీ నుండి ఈ సినిమాను తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేనున్నట్లు ఆహా సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి తెలుగు ప్రేక్షకులను ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్. ప్రసాద్ మ్యూజిక్ ను అందించారు. ఇక ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే జూన్ 7 వ తేదీ నుండి ఈ మూవీ ఆహా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: