కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఓ రేవ్ పార్టీ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆ రేవ్ పార్టీ జరుగుతున్న విషయాన్ని పోలీసులు తెలుసుకొని అక్కడికి వెళ్లి కొంత మందిని అరెస్ట్ చేశారు. ఇక అరెస్టు చేసిన తర్వాత అందులో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొంత మంది నటీ నటులు కూడా ఉన్నారు అనే వార్తలు బయటకు వచ్చాయి. అందులో నటి హేమ కూడా ఉంది అని వార్తలు బయటికి వచ్చాయి.

దానితో వెంటనే హేమ ఓ వీడియోను విడుదల చేసి నేను బెంగుళూరు లోని ఓ రేవ్ పార్టీలో ఉన్నాను అని , నన్ను పోలీసులు అరెస్టు చేశారు అని , ఒక వార్త వస్తుంది. ఆ వార్తలు అన్ని అవాస్తవం. నేను ప్రస్తుతం హైదరాబాదు లోనే ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను. అక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుకున్నారు అని వస్తున్న విషయాలు అన్ని అవాస్తవం అని చెప్పింది. ఇకపోతే ఆ తర్వాత బెంగళూరు పోలీసులు మేము పట్టుకుంది హిమా నే అంటూ ఒక ఫోటోను కూడా విడుదల చేశారు.

ఇక ఆ తర్వాత ఆ రేవ్ పార్టీ లో పట్టుకున్న వారందరిపై డ్రగ్స్ టెస్ట్ చేయగా హేమ కు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇకపోతే ఈ డ్రెస్ కేసు విషయం ముదరడంతో తాజాగా మా అసోసియేషన్ ఈమె కు పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం హేమ బెంగుళూరు లోని పరప్పర అగ్రహారం జైల్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: