డైరెక్టర్ శంకర్ , కమల్ హాసన్ హీరో గా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలో ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాని జూన్ నెలలో కాకుండా జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను  ఫుల్ జోష్ లో ముందుకు తీసుకు వెళుతున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన రెండు పాటలను కూడా మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీలోని మూడవ సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.

మూవీ లోని మూడవ పాట అయినటువంటి కధరల్స్ అంటూ సాగే పాటను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూడవ సాంగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండటంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: