తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి వెళుతూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రల లో నటించి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత హీరోగా సినిమాలను చేస్తున్నప్పుడు కూడా ఈయన రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేయకుండా కాస్త డిఫరెంట్ సినిమా లలో నటిస్తూ వస్తున్నాడు.

దానితో ఈయనకు మంచి విజయాలు అందుతున్నాయి . అలాగే నటుడి గా గుర్తింపు కూడా దక్కుతుంది . కొంతకాలం క్రితమే ఈయన సామజవర ఎంగమన ఓం బీమ్ బుష్ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించి వరుసగా రెండు విజయాలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ నటుడు హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న స్వాగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మీరా జాస్మిన్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఇకపోతే ఈ మూవీ లో శ్రీ విష్ణు ఏకంగా 14 రకాలైన పాత్రలలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలుస్తుంది. ఇక ఈ 14 పాత్రలలో ఓ పాత్రలో శ్రీ విష్ణు ట్రాన్స్ జెండర్ గా కూడా కనిపించబోతున్నట్లు , ఈ పాత్రను దర్శకుడు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గతంలో శ్రీ విష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో  రాజ రాజ చోరా అనే సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. దానితో విరి కాంబో లో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి స్వాగ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv